ఆపరేషన్ స్మైల్: జనవరిలో 2,814 మంది చిన్నారులను రక్షించిన తెలంగాణ పోలీసులు
జనవరిలో రాష్ట్రంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-IX కోసం, ప్రతి సబ్ డివిజన్‌లో 753 మంది పోలీసు సిబ్బందితో పోలీసు బృందాలు (ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు) ఏర్పాటు చేయబడ్డాయి. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో, లేబర్, హెల్త్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWC), జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, NGOలతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు తమలక్ష్యాన్ని సాధిస్తున్నారు.
ఆపరేషన్ స్మైల్ పేరుతో తెలంగాణ పోలీసులు చేపట్టిన కార్యక్రమం చిన్నారుల, వారి తల్లితండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతోంది. తప్పిపోయిన, ఇంటి నుంచి పారిపోయిన, బాండేడ్ లేబర్ గా ఉన్న పిల్లలను వాళ్ళ తల్లితండ్రుల దగ్గరకు, అనాథలైతే అనాథ శరణాలయాలకు చేర్చడం తెలంగాణ పోలీసులు విశేష కృషి చేస్తున్నారు.
జనవరిలో రాష్ట్రంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-IX కోసం, ప్రతి సబ్ డివిజన్‌లో 753 మంది పోలీసు సిబ్బందితో పోలీసు బృందాలు (ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు) ఏర్పాటు చేయబడ్డాయి. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో, లేబర్, హెల్త్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWC), జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, NGOలతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు తమలక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఒక్క జనవరి నెలలోనే 2,814 పిల్లలను పోలీసులు రక్ధించారు.
2017లో కర్ణాటకలోని మైసూరు నుంచి తప్పిపోయి నల్గొండలోని శిశు సంరక్షణ సంస్థలో ఉంటున్న ఓ బాలుడు తెలంగాణ రాష్ట్ర పోలీసుల కృషితో ఎట్టకేలకు తన కుటుంబంతో కలిశాడు.
జనవరి నెలలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-IX కింద, నల్గొండలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) గత ఆరేళ్లుగా పిల్లల సంరక్షణ సంస్థలో ఉంటున్న బాలుడిని గుర్తించింది. సమీపంలోని ఆధార్ సెంటర్ లో ఆ బాలుడి వివరాలను ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌లో నమోదు చేసింది. దాంతో అతని తల్లిదండ్రుల వివరాలతో ఇతని వివరాలు అనుసంధానించబడ్డాయని తెలుసుకొని, కుటుంబాన్ని గుర్తించి అబ్బాయిని అప్పగించారు.
మరో సందర్భంలో, నగరంలోని నాంపల్లి నుండి అదృశ్యమైన బాలికను గుర్తించి కుటుంబం దగ్గరికి చేర్చారు. అనాథ ఆశ్రమాన్ని విడిచిపెట్టిన 15 ఏళ్ల బాలికను కూడా గుర్తించి ఫలక్‌నుమాలో ఉన్న అనాథ శరణాలయానికి అప్పగించారు. అదేవిధంగా వరంగల్‌లోని పర్కాల్‌లో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిన 16 ఏళ్ల యువకుడిని పోలీసుల బృందం గుర్తించి తిరిగి ఇంటికి తీసుకువచ్చింది.
ఆపరేషన్ స్మైల్: జనవరి నెలలో...
* రక్షించబడిన పిల్లలు – 2,814 (బాలురు – 2,421, బాలికలు- 393)
* తల్లిదండ్రులు/సంరక్షకుల దగ్గరికి చేరిన పిల్లలు – 2,467 (బాలురు–2,163, బాలికలు-304)
* రెస్క్యూ హోమ్‌లలో చేరిన పిల్లలు –347 (బాలురు–258, బాలికలు -89)
* రక్షించబడిన వీధి పిల్లలు – 161 (బాలురు-142, బాలికలు-19)
* బాండెడ్ లేబర్ నుండి రక్షించబడిన పిల్లలు -1,401 (బాలురు-1,289, బాలికలు-112)
* ఇటుక బట్టీల నుండి రక్షించబడిన పిల్లలు – 203 (బాలురు-122, బాలికలు-81)
* భిక్షాటన నుండి రక్షించబడిన పిల్లలు –119 (బాలురు-61, బాలికలు-58)
* పరిశ్రమలు/ఉద్యోగాల నుండి రక్షించబడిన పిల్లలు – 930 (బాలురు-807, బాలికలు-123)