Telugu Global
Telangana

హైదరాబాదులో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్‌ల విలువ రూ.9,100 కోట్లు : మంత్రి కేటీఆర్

జీహెచ్ఎంసీ పరిధిలోని లబ్ధిదారులు అందజేయడానికి నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూం విలువ రూ.9,100 కోట్లు ఉంటుందని మంత్రి చెప్పారు.

హైదరాబాదులో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్‌ల విలువ రూ.9,100 కోట్లు : మంత్రి కేటీఆర్
X

దేశంలో ఏ రాష్ట్రంలో లేవి విధంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే పూర్తి ఉచితంగా లక్షల విలువైన ఇంటిని అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తొలి సారిగా సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని లబ్ధిదారులు అందజేయడానికి నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూం విలువ రూ.9,100 కోట్లు ఉంటుందని మంత్రి చెప్పారు. ఎంతో నాణ్యమైన ఇంటిని నిర్మించి ఉచితంగా అందిస్తున్నాము. ఒక్కో ఇంటి మార్కెట్ విలువ రూ.50 లక్షల వరకు ఉంటుంది. కానీ లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని తెలిపారు. కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం సముదాయంలో ఇప్పటికే 70 వేల యూనిట్లు పూర్తయ్యాయి.. మిగిలిన వాటిని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే 11,700 డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు ఒకే రోజు అందించాము. మిగిలిన వారికి కూడా త్వరలోనే అలాట్‌మెంట్ చేయాలని కేటీఆర్ సూచించారు. ఎటువంటి తప్పులు జరుగకుండా, పూర్తి పారదర్శకంగా డబుల్ బెడ్‌డ్రూంలు కేటాయించాలని చెప్పారు.

ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల నిధులు మంజూరు..

ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఖమ్మం సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే రూ.790 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా రూ.100 కోట్లను టీయూఎఫ్ఐడీసీ ద్వారా అందించనున్నారు. దీనికి సంబంధించిన నిధుల కాపీని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు అందించారు. ఖమ్మంను వరదల తాకిడి నుంచి కాపాడటానికి మున్నేరుకు ఇరువైపులా కాంక్రిట్ వాల్స్ నిర్మించనున్నారు. దీంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నందుకు పువ్వాడను కేటీఆర్ అభినందించారు.

First Published:  8 Sept 2023 2:33 PM IST
Next Story