తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు
రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి.
తెలంగాణలో రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. కులగణన సర్వే ఇంటింటి సర్వేలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆయా స్కూళ్ల టీచర్లు మూడు వారాలపాటు కుల గణనలో పాల్గొంటారని, కాబట్టి ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్నం వరకే పనిచేస్తాయని పేర్కొంది.
ప్రాథమిక పాఠశాలలు ఒంటి గంట వరకు పనిచేసిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాల్సిందేనని ఆదేశించింది. హైస్కూళ్లలో పనిచేస్తున్నా ఎస్జీటీలను ఈ సర్వే నుంచి మినహాయించారు. ఈ సర్వేను ఈ నెల 30 వరకు కొనసాగనున్నాది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 36,559మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పాల్గోంటారు.