Telugu Global
Telangana

ఆ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయి

మూడున్నర నుంచి నాలుగేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి

ఆ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయి
X

హైదరాబాద్‌ మహానగరం చుట్టూ నిర్మించే ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ పూర్తి చేసి పంపుతామని చెప్పినట్లు వెల్లడించారు. శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయన్నారు. బీఆర్‌ఎస్‌ మాదిరిగా తమకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదని విమర్శించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి కేంద్ర మంత్రి గడ్కరీని ఏడుసార్లు కలిశాను. రెండు నెలల్లో పనులు ప్రారంభించడానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మూడున్నర నుంచి నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

First Published:  18 March 2025 1:13 PM IST
Next Story