Telugu Global
National

బాలీవుడ్ నటి కంగనాకు మరోసారి కోర్టు నోటీసులు

బాలీవుడ్ నటి, బీజేపీ మండి ఎంపీ కంగనా రనౌత్‌కు ఆగ్రా నోటీసులు జారీ చేసింది.

బాలీవుడ్ నటి కంగనాకు మరోసారి కోర్టు నోటీసులు
X

ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ మండి ఎంపీ కంగనా రనౌత్ మరోసారి చిక్కులోపడ్డారు. అన్నదాతపై అవమానకర కామెంట్స్ చేసిన కేసులో కంగనాకు ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. యూపీ ఆగ్రాలోని రాజీవ్ గాంధీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ రామశంకర్ శర్మ, సీనియర్ న్యాయవాది ఈ ఏడాది సెప్టెంబర్ 11న కంగనాపై కేసు వేశారు. ఆగస్టు 27న పత్రికల్లో కంగనా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయన కేసు నమోదు చేశారు. ఎన్డీయే సర్కార్ తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బంగ్లాదేశ్‌ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉండేదంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని.. సాగు చట్టాలను వెనక్కితీసుకున్నా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వార్థ ప్రయోజనాలను ఆశించే వారు నిరసనలను ప్రోత్సహించారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది, విదేశీ శక్తులు ఇందుకు కుట్ర పన్నారంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలో దుమారం రేపాయి. అదే సమయంలో ఆమె వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కంగనా రనౌత్‌ దేశంలోని కోట్లాది మంది రైతులను అవమానించారని రామశంకర్‌ శర్మ ఆరోపించారు.

First Published:  12 Nov 2024 6:37 PM IST
Next Story