ఎల్లుండి KCR అధ్యక్షతన BRS పార్లమెంటరీ, శాసనసభాపక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గం భేటీ..!
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్నందున, ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌ల చైర్మన్లు హాజరుకావాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్నందున, ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఆ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
మరో వైపు, రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించడమే కాకుండా వాటి అమలుకు సంబంధించిన కీలక నిర్ణయాలు కేబినెట్ తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ కోటా కింద రాష్ట్ర శాసనమండలికి నామినేట్ కానున్న ఇద్దరు అభ్యర్థుల పేర్లను కూడా ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.