50 ఏళ్లలో 'స్కాం'గ్రెస్ చేయలేనిది ఐదేళ్లలో చేసి చూపించాం
50 ఏళ్లలో స్కాంగ్రెస్ చేయలేనిది తాము ఐదేళ్లలోనే చేసి చూపించామన్నారు. 16ఏళ్ల క్రితం మొదలు పెట్టిన పోరాటాన్ని మంత్రి కేటీఆర్ మరోసారి గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ ని స్కాంగ్రెస్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. 50 ఏళ్ల స్కాంగ్రెస్ పాలనలో చేయలేనిది తాము 5 ఏళ్లలోనే చేసి చూపించామన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ రక్కసిని పూర్తిగా పారదోలామని చెప్పారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ లేని నల్గొండలో ప్రజలు భయం లేకుండా గుక్కెడు మంచినీరు తాగుతున్నారంటే దానికి కారణం కేసీఆర్ కాక ఇంకెవరని ప్రశ్నించారు. 16 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులకోసం తాను చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.
16 years ago in Nalgonda fighting for Fluorosis victims against the then inept Congress Govt
— KTR (@KTRBRS) June 18, 2023
Today, we are in Telangana state with Fluoride finally eradicated from Nalgonda thanks to KCR Garu’s brainchild “Mission Bhagiratha”
What Scamgress couldn’t do in 50 years, we have… https://t.co/kALITbZ0rj
తెలంగాణ మంచినీళ్ల పండగ సందర్భంగా నల్గొండ దుస్థితిని ఓసారి గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా 16 ఏళ్ల క్రితం కేటీఆర్, నల్గొండ ఫ్లోరోసిస్ కి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని గుర్తుకొచ్చేలా పాత వీడియో తెరపైకి తెచ్చారు. నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ భూతం బారినుంచి కాపాడేందుకు పార్టీ తరపున పోరాటం చేస్తామని కేేటీఆర్ అప్పట్లో చెప్పారు. జాతీయ మానవ హక్కుల సంఘం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దృష్టికి కూడా ఆ విషయం తీసుకెళ్లి.. నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేస్తామని, దానికి పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది.
ఫ్లోరైడ్ కలుషిత నీటిని తాగడమే అక్కడి ప్రజలకు శాపం. అందుకే ఆ మిషన్ భగీరథ ద్వారా ఇప్పుడు ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నల్గొండ ప్రజలకు పునర్జీవమిచ్చింది. అప్పటి పోరాటంలో పడిన తొలి అడుగు, ఇప్పుడు నల్గొండ ప్రజలను ఫ్లోరైడ్ బారినుంచి కాపాడింది. తెలంగాణ ఏర్పాటైన ఐదేళ్లలోనే నల్గొండ బాధలు తీర్చామని చెప్పారు మంత్రి కేటీఆర్. 50 ఏళ్లలో స్కాంగ్రెస్ చేయలేనిది తాము ఐదేళ్లలోనే చేసి చూపించామన్నారు. 16ఏళ్ల క్రితం తాను మొదలు పెట్టిన పోరాటాన్ని ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు.