T న్యూస్‌ను ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు..? - BRSకు రేవంత్ డెడ్‌లైన్
హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ కార్యక్రమాల కోసమని ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఛానల్ నిర్వహిస్తూ వ్యాపారం చేయడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
రేవంత్ ప్రభుత్వంలో BRS పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ భవన్‌కు రెవెన్యూశాఖ బుధవారం నోటీసులు జారీ చేసింది. BRS పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేయడంపై అధికారులు నోటీసులిచ్చారు. పార్టీ ఆఫీస్ నుంచి టీ-న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. BRS భవన్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని నోటీసుల్లో వివరణ కోరారు అధికారులు.
ఇక ఇదే ఇష్యూపై హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ కార్యక్రమాల కోసమని ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఛానల్ నిర్వహిస్తూ వ్యాపారం చేయడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హైకోర్టులో ఈ పిల్ వేశారు.
రెవెన్యూశాఖ నోటీసులపై స్పందించేందుకు తెలంగాణ భవన్ వర్గాలు నిరాకరించాయి. 2011 నుంచి BRS భవన్‌లోనే టీ-న్యూస్ ఛానల్‌ను నిర్వహిస్తోంది యాజమాన్యం. ఎన్నికల్లో ఓటమి తర్వాత మరో భవనానికి టీ-న్యూస్‌ను షిఫ్ట్ చేసే ప్రయత్నాలను BRS ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. తాజాగా రెవెన్యూశాఖ నోటీసులతో ఆ ప్రక్రియ మరింత వేగవంతం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ నోటీసులు, కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించడంపై BRS పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.