ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. కదలి వచ్చిన తారాలోకం
ఎన్టీఆర్ కి భారత రత్న వచ్చే వరకు పోరాడతామని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తే దేశానికే గౌరవమన్నారు.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి కైత్లాపూర్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చంద్రబాబు, బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కీర్తిని కొనియాడారు. ఎన్టీఆర్ కారణ జన్ముడని, మహానుభావుడని తెలిపారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. 'ఎన్టీఆర్ శకపురుషుడు' అనే పుస్తకాన్ని హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. ఎన్టీఆర్ తో కలసి నటించిన జయసుధ, జయప్రద, మురళీ మోహన్ సహా.. ఇతర నటీనటులు ఆయన జ్ఞాపికలు అందుకున్నారు. హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, నాగచైతన్య, సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేష్.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బాబు మోహన్, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, అశ్వినీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్ రావిపూడి, శ్రీలీల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎన్టీఆర్ కి భారత రత్న వచ్చే వరకు పోరాడతామని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తే దేశానికే గౌరవమన్నారు. ఈనెల 28న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రతి ఇంట్లో ఆయనకు నివాళి అర్పించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ నిర్ణయించింది. ఈ విగ్రహ ఏర్పాటుకి అందరూ సహకరించాలి కోరారు కమిటీ సబ్యులు.