తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాల ఏర్పాటు... నోటిఫికేషన్ జారీ
తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
BY Telugu Global26 Sept 2022 5:44 PM GMT
X
Telugu Global Updated On: 26 Sept 2022 5:45 PM GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది జిల్లాలు 33 జిల్లాలయ్యాయి. ఇంకా అనేక మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పడ్డాయి. పాలన మరింత సాఫీగా సాగడం కోసం ఇప్పుడు మరిన్ని మండలాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాజాగా రాష్ట్రంలో మరో 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేశారు.
కొత్త మండలాలు: భీమారం, ఎండవల్లి (జగిత్యాల జిల్లా), నిజాంపేట్ (సంగారెడ్డి జిల్లా), గట్టుప్పల్ (నల్లగొండ జిల్లా), సీరోలు, ఇనుగుర్తి (మహబూబాబాద్ జిల్లా), కౌకుంట్ల (మహబూబ్ నగర్ జిల్లా), అక్బర్ పేట్, భూంపల్లి, కుకునూర్‌పల్లి (సిద్దిపేట జిల్లా), డోంగ్లీ (కామారెడ్డి జిల్లా), ఆలూర్, డొంకేశ్వర్ సాలూరా (నిజామాబాద్ జిల్లా)
Next Story