కోకోపేటను మించిపోవాలి.. ఈసారి బుద్వేల్ కి నోటిఫికేషన్
బుద్వేల్ భూముల కనీస ధర ఎకరాకి 20కోట్ల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది, అయితే సగటున ఒక్కో ఎకరా కనీసం 30 కోట్లకు అమ్మడవుతుందని అంటున్నారు. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా వేస్తోంది.
కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలంలో ఎకరం గరిష్టంగా రూ.100.75 కోట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ప్రభుత్వ వేలంలో ఇదే అత్యథికం. ఇదే ఊపులో ఇప్పుడు బుద్వేల్ భూముల అమ్మకానికి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. ఈనెల 6వతేదీన ప్రీ బిడ్ సమావేశంతో ఈ లాంఛనం మొదలవుతుంది. బుద్వేల్ లో ఎకరం భూమికి కనీస ధర రూ.20కోట్లుగా ఫిక్స్ చేసింది ప్రభుత్వం.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేశారు. మౌలిక వసతులు కల్పించి, మల్టీపర్పస్ బిల్డింగ్ ల ఏర్పాటుకి అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇప్పుడీ స్థలం హాట్ కేక్ లా కనపడుతోంది. కోకాపేట భూముల వేలానికి భారీ స్పందన రావడంతో వెంటనే బుద్వేల్ భూముల అమ్మకం కూడా తెరపైకి వచ్చింది. అన్ని రకాల వసతులు ఉన్న బుద్వేల్ భూముల్ని హెచ్ఎండీఏ ద్వారా అమ్మకానికి సిద్ధం చేశారు.
బుద్వేల్ భూముల వివరాలు, ముఖ్యమైన తేదీలు..
బుద్వేల్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూమి 100 ఎకరాలు
మొత్తం ప్లాట్లు 14
ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాలు
ఎకరా కనీస ధర రూ.20 కోట్లు
ఆగస్ట్ 6 - ప్రీ బిడ్ సమావేశం
ఆగస్ట్ 8 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం
ఆగస్ట్ 10 - E వేలం నిర్వహణ
బుద్వేల్ భూముల కనీస ధర ఎకరాకి 20కోట్ల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది, అయితే సగటున ఒక్కో ఎకరా కనీసం 30 కోట్లకు అమ్మడవుతుందని అంటున్నారు. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా వేస్తోంది.