అక్రమ నిర్మాణాలపై సినీ నటుడు అలీకి నోటీసులు
అనుమతి లేకుండా ఫామ్‌హౌస్ నిర్మాణాలు చేస్తున్నారని నోటీసులు పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి
BY Raju Asari24 Nov 2024 11:53 AM IST

X
Raju Asari Updated On: 24 Nov 2024 11:53 AM IST
వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామపంచాయతీ సినీ నటుడు అలీకి నోటీసులు ఇచ్చింది. అనుమతి లేకుండా ఫామ్‌హౌస్ నిర్మాణాలు చేస్తున్నారని అందులో పేర్కొన్నది. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలు ఆపేయాలని ఆదేశించారు.
ఎక్ మామిడి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 345లోని ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలు సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించకపోవడంతో తాజాగా మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సంబంధిత ధృవపత్రాలు సమర్పించి అనుమతులు పొందాలని సూచించారు. లేకపోతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.
Next Story