ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. నేడు జూబ్లీహీల్స్ ఏసీపీ ఎదుట హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
BY Vamshi Kotas11 Nov 2024 8:57 AM GMT
X
Vamshi Kotas Updated On: 11 Nov 2024 8:57 AM GMT
ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. నేడు జూబ్లీహీల్స్ ఏసీపీ ఎదుట హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి ఓ రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ అయ్యాయి.ఈ కేసులో నిందితుడు తిరుపతన్నతో ఫోన్ కాంటాక్ట్స్ ఉండటంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు.
2010లో తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ ఆమోదించలేదు. 2011లో మరోసారి రాజీనామా చేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లింగయ్య... ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్‌లో ఓ రాజకీయ నేతకు నోటీసులివ్వడం ఇదే మొదటి సారి.
Next Story