Telugu Global
Telangana

రాహుల్ గాంధీ కాదు.. రాంగ్ గాంధీ.. మంత్రి హరీష్‌రావు ఫైర్‌

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు పథకాలు అందటం లేద‌ని, అక్క‌డి ప్రజలు ఏది అడిగినా ఖజానా ఖాళీ అయ్యింది అని ఆ రాష్ట్ర సీఎం సాకులు చెబుతున్నారని హ‌రీష్‌రావు విమ‌ర్శించారు.

రాహుల్ గాంధీ కాదు.. రాంగ్ గాంధీ.. మంత్రి హరీష్‌రావు ఫైర్‌
X

రాహుల్ గాంధీ కాదు.. రాంగ్ గాంధీ.. మంత్రి హరీష్‌రావు ఫైర్‌

క‌ర్ణాట‌క‌లో ఓట‌ర్ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌కుండా అక్క‌డి ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ మోసం చేసింద‌ని మంత్రి హ‌రీష్‌రావు దుయ్య‌బ‌ట్టారు. క‌ర్ణాట‌క‌లో ఐదు హామీలే అమ‌లు చేయ‌ని రాహుల్ గాంధీ.. ఆరు గ్యారంటీలు అంటూ ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి వస్తున్నార‌న్నారు. అక్క‌డ 5 గ్యారంటీలే అమ‌లు చేయ‌లేనివారు.. ఇక్క‌డ ఆరు హామీలు అమ‌లు చేస్తారా..? అని నిల‌దీశారు. ప్ర‌జ‌ల్ని మోసం చేసిన రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీగా మారార‌ని విమ‌ర్శించారు.

ఏది అడిగినా ఖజానా ఖాళీ అంటున్నారు

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు పథకాలు అందటం లేద‌ని, అక్క‌డి ప్రజలు ఏది అడిగినా ఖజానా ఖాళీ అయ్యింది అని ఆ రాష్ట్ర సీఎం సాకులు చెబుతున్నారని హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. విద్యార్థుల స్కాలర్‌షిప్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో కార్మికుల పిల్లలు చదువుకు దూర‌మ‌వుతున్నార‌న్నారు. అభివృద్ధి నిధులు ఇవ్వకపోతే జనాల్లోకి ఎలా వెళ్ళాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని నిల‌దీస్తున్నార‌ని చెప్పారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ రంగుల బొమ్మలు చూపిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ రంగు రంగుల ప్రపంచం చూపుతోంద‌ని హ‌రీష్ ఎద్దేవా చేశారు. వెలుగుల దీపావళి కావాలా, వ‌చ్చీపోయే క‌రెంటు లాంటి కర్ణాటక దివాలా కావాలా తెలంగాణ ప్ర‌జ‌లు తేల్చుకోవాల‌న్నారు. తెలంగాణ‌లో రైతు ఆత్మ‌హ్య‌త‌లు త‌గ్గాయ‌న్నారు. కానీ, క‌ర్ణాట‌క‌లో మాత్రం 357 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నార‌ని హ‌రీష్ చెప్పారు. కర్ణాటక ఫెయిల్యూర్ మోడల్‌ను తీసుకొస్తున్న రాహుల్‌గాంధీకి తెలంగాణ ఓట‌ర్లు బుద్ధిచెబుతార‌ని హ‌రీష్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

First Published:  17 Nov 2023 12:47 PM IST
Next Story