కేటీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
కేటీఆర్ లీగల్ నోటీసుపై తీవ్రంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
BY Raju Asari23 Oct 2024 2:21 PM IST

X
Raju Asari Updated On: 23 Oct 2024 2:21 PM IST
కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోవడానికి దమ్ములేకే లీగల్ నోటీసులు ఇచ్చారని అన్నారు. కేటీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరేనని, అందుకు బదులుగానే తాను మాట్లాడనని స్పష్టం చేశారు. తాను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తిని అన్నారు. లీగల్ నోటీసుకు లీగల్‌గా బదులిస్తానని పేర్కొన్నారు. చట్టం న్యాయం ప్రకారం ముందుకు వెళ్తానని చెప్పారు.
Next Story