ఒక్క రైతు చనిపోలేదు.. కేసీఆర్ కామెంట్స్‌పై ఉత్తమ్
తెలంగాణలో ఇప్పటివరకూ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు ఉత్తమ్. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని కేసీఆరే కోరుకుంటున్నట్లు ఉందన్నారు.
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకూ 209 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలతో ఓ లిస్టును సైతం బీఆర్ఎస్ సిద్ధం చేసింది.
అయితే తాజాగా ఈ అంశంపై స్పందించారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. తెలంగాణలో ఇప్పటివరకూ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు ఉత్తమ్. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని కేసీఆరే కోరుకుంటున్నట్లు ఉందన్నారు. రైతులను ఆత్మహత్యలవైపు కేసీఆర్ ఉసిగోల్పుతున్నారని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
VIDEO | Here’s what Telangana Minister and Congress leader Uttam Kumar Reddy (@UttamINC) said on BRS chief K Chandrashekar Rao’s allegation of artificial drought in the state.
— Press Trust of India (@PTI_News) April 6, 2024
“I would like to put this on record that not even a single farmer has committed suicide in Telangana.… pic.twitter.com/ooFFG07jdB
కేసీఆర్, ఆయన పార్టీ ఉనికి కోసం పాకులాడుతోందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు ఉత్తమ్. రాజకీయ ఉనికి ఉండదనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నారన్నారు. తన వైఫల్యాలకు కేసీఆర్ కాంగ్రెస్‌ను నిందిస్తున్నారని విమర్శించారు.