Telugu Global
Telangana

ఢిల్లీకి బయలుదేరిన కల్వకుంట్ల కవిత‌

బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ తో కవిత చర్చి‍ంచినట్టు సమాచారం. బీజేపీపై పోరాటం కొనసాగించాలని, పార్టీ మొత్తం తనకు అండగా ఉంటుందని కవితకు కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని కొనసాగించమని ఆమెకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. దాంతో కవిత ఢిల్లీకి బయలుదేరారు.

ఢిల్లీకి బయలుదేరిన కల్వకుంట్ల కవిత‌
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు ఈ నెల 9న తమ ముందు హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. అయితే 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై దీక్ష చేపట్టిన కవిత, ఆ కారణం రీత్యా 9న తాను రాలేనని, మరో తేదీ కేటాయించవలసిందిగా ఈడీకి లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు ఈడీ నుంచి ఎటువంటి స్పందన లేదు.

ఈ నేపథ్యంలో బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ తో కవిత చర్చి‍ంచినట్టు తెలిసింది. బీజేపీపై పోరాటం కొనసాగించాలని, పార్టీ మొత్తం తనకు అండగా ఉంటుందని కవితకు కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని కొనసాగించమని ఆమెకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. దాంతో కవిత ఢిల్లీకి బయలుదేరారు. ఆమెతో పాటు పలువురు బీఆరెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో కవిత ఢిల్లీలో ఎల్లుండి దీక్ష చేపట్టబోతున్నారు. సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్ర‌మంలో 18 పార్టీల నాయకులు పాల్గొంటారు.

లేటెస్ట్ అప్డేట్:

కవిత రాసిన లేఖకు ఈడీ ఇప్పుడే సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కవిత విజ్ఞప్తిని ఈడీ అంగీకరించినట్టు, ఈ నెల 11న తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ అధికారులు కవితకు సూచించినట్టు సమాచారం

First Published:  8 March 2023 12:25 PM GMT
Next Story