Telugu Global
Telangana

షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎన్నికలు.. కేటీఆర్

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరగవచ్చునన్న ఊహాగానాలకు తెరదించారు మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు.

షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎన్నికలు.. కేటీఆర్
X

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరగవచ్చునన్న ఊహాగానాలకు తెరదించారు మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తధ్యమని అన్నారు. తమ పార్టీలోని విభేదాలు పార్టీకే బలమని పేర్కొన్న ఆయన.. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

2023 లోనే ఎన్నికలు జరుగుతాయి.. ముందస్తుకు వెళ్లబోం అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సీఎం కేసీఆర్ బీజేపీయేతర సీఎంలకు, నేతలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్ ఎవరికీ భయపడబోరని, లొంగబోరని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రైవేటు విజిట్ లకు వస్తే ఎందుకు రిసీవ్ చేసుకోవాలని ప్రశ్నించారు.

మోడీ దేశానికి ప్రధాని కాదని, గుజరాత్ కి మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రానికి రాష్ట్రం రూపాయి ఇస్తే తిరిగి వచ్చేది 40 పైసలేనని అన్నారు. రాష్టానికి వరదలు వస్తే కేంద్రం ఏమాత్రం సాయం చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ సర్వేలు రెండు కూడా ఎన్నికల్లో తెరాస గెలుస్తాయని చెప్పాయన్నారు..టీఆరెస్ ఐడియాలజీ నచ్చినవారు ఎప్పటికీ పార్టీలోనే ఉంటారని, కొంతమంది ఛాన్స్ వస్తుందని పార్టీ మారితే వద్దనలేమన్నారు. ప్రశ్నించడాన్ని కూడా అన్ పార్లమెంటరీ అంటే ఎలా అని కేటీఆర్ ప్రశ్నించారు.(కొన్ని పదాలను ఎంపీలు మాట్లాడరాదంటూ లోక్ సభ సెక్రటేరియట్ ఇటీవల ఓ బుక్ లెట్ ను విడుదల చేసింది. అయితే దీన్ని పట్టించుకోవద్దంటూ స్పీకర్ ఆ తరువాత వివరణ నిచ్చారు). . కాగా- వరదలు వచ్చి మోటార్లు మునిగినా కేసీఆర్ దే తప్పంటారా అని కేటీఆర్ వ్యగ్యంగా బండిసంజయ్ , రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


First Published:  15 July 2022 2:54 PM IST
Next Story