మా బాధను ఎవరూ తీర్చలేరు..ప్రణయ్ తండ్రి భావోద్వేగం
నల్గొండ కొర్టు తీర్పు వెలువడిన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

ప్రణమ్ హత్య కేసు తీర్పు తర్వాత అతడి తండ్రి బాలస్వామి కుమారుడి సమాధి వద్ద నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతం అయ్యారు. మా బాధను ఎవరూ తీర్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవర్ని చూసినా మా కొడుకే గుర్తుకు వస్తున్నాడన్నారని చంపుకోవడం కరెక్ట్ కాదని వాపోయారు .మాకు ఎవరిమీద కోపం లేదన్నారు. కేవలం ఈ హత్యలు ఆగాలనే సాక్ష్యం చెప్పామని వివరించారు. న్యాయస్థానం సరైన తీర్పు ఇచ్చిందన్నారు. అమృతకు భర్త లేడు. నాకు కొడుకు లేడు నామనవడికి నాకు లేడని తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు.
ప్రణయ్ హత్యకేసులో కోర్టు తీర్పుపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. 9 నెలలు కష్టపడి చార్జ్‌షీట్ దాఖలు చేశామని.. ఏ ఎవిడెన్సు వదల్లేదు అని చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2018 సెప్టెంబర్ 14 న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. అయితే… ఆ సమయంలో నల్గొండ జిల్ల ఎస్పీగా ఉన్న ఏ.వీ రంగనాథ్.. ఈ కేసును డీల్ చేశారు. ఇక తాజాగా ప్రణయ్ హత్యకేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.