అర్వింద్ డౌన్ డౌన్.. బీజేపీ ఆఫీస్ లో నినాదాలు
నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల అధ్యక్షులను పార్టీ నిబంధనలను విరుద్దంగా మార్చారంటూ గొడవ మొదలు పెట్టారు. ఈ మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానిక నాయకులు. దీంతో వారంతా హైదరాబాద్ వచ్చి గొడవ చేశారు.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్ అంటూ తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో నినాదాలు మిన్నంటాయి. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ కి వెళ్లిన నిజామాబాద్ జిల్లా నేతలు స్థానిక ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్వింద్ వ్యతిరేక వర్గం సడన్ గా ఆఫీస్ కి వచ్చి రచ్చ చేయడంతో కలకలం రేగింది. కాసేపు ఆఫీస్ లోనే బైఠాయించిన పార్టీ నేతలు, కార్యకర్తలు.. నినాదాలు చేసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిజామాబాద్ నుంచి ఎంపీ అర్వింద్ వైరి వర్గం హైదరాబాద్ వచ్చి పార్టీ ఆఫీస్ ముందు రచ్చ చేసిన సమయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోపలే ఉండటం విశేషం. ఆయన ఉన్నాడని తెలిసే బీజేపీ నాయకులు అక్కడికి వచ్చి గొడవ చేశారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి.. వారిని అక్కడి నుంచి పంపించివేశారు. వారు కిషన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా కుదర్లేదు.
నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల అధ్యక్షులను పార్టీ నిబంధనలను విరుద్దంగా మార్చారంటూ గొడవ మొదలు పెట్టారు. ఈ మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానిక నాయకులు. దీంతో వారంతా హైదరాబాద్ వచ్చి గొడవ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలుగజేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.