నిర్మల్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్.. ఈ స్పెషాలిటీస్ మీకు తెలుసా..?
జిల్లా స్థాయిలో ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు ఒకేచోట అందేలా రూపొందించారు. 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో కొత్త కలెక్టరేట్ నిర్మించారు.
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని ఈరోజు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో కొత్త కలెక్టరేట్ నిర్మించారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్మల్ కలెక్టరేట్ అన్ని హంగులతో ముస్తాబైంది.
కలెక్టరేట్ కార్యాలయం ఓ కార్పొరేట్ ఆఫీస్ ని తలపిస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు ఒకేచోట అందేలా దీన్ని రూపొందించారు. 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు పైన రెండు అంతస్తులు ఉండేలా దీన్ని నిర్మించారు.
Integrated District Offices Complex, Nirmal is all ready to be inaugurated by Hon'ble Chief Minister sir today. #IDOC #Nirmal #Collectorate #Telangana #DashabdiUtsavalu pic.twitter.com/46ZgJN95cI
— Collector Nirmal (@Collector_NML) June 4, 2023
గ్రౌండ్ ఫ్లోర్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు ఉంటాయి. వీటితోపాటు రెండు వెయిటింగ్ హాళ్లు, రెండు వీడియోకాన్ఫరెన్స్ హాళ్లు, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్ హాల్ ను గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్మించారు. కలెక్టరేట్ మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఉంటాయి.
ఆక్సిజన్ జోన్..
కలెక్టరేట్ ను పూర్తి ఆక్సిజన్ జోన్ గా రూపొందించారు. భవనంలో రెండు లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్‌లో 80 వేల లీటర్ల నీటి సామర్థ్యంతో సంప్, 20 వేల లీటర్ల సామర్థ్యంతో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. కలెక్టరేట్ ముందు ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కోసం ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు అందుబాటులోకి వస్తే పాలన మరింత సులువవుతుందనేది సీఎం కేసీఆర్ ఆలోచన. దానికి తగ్గట్టే వివిధ జిల్లాల్లో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. నిర్మల్ కలెక్టరేట్ ని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు.