Telugu Global
Telangana

టీఎస్‌ ప్రభుత్వానికి ఎన్‌జీటీ జరిమానా

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ సుమారు రూ.900 కోట్ల జరిమానా వేసింది.

టీఎస్‌ ప్రభుత్వానికి ఎన్‌జీటీ జరిమానా
X

తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్‌జీటీ అభ్యంతరం తెలిపింది. అనుమతి లేకుండా పనులు చేసినందుకు గాను.. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం మొత్తాన్ని జరిమానాగా విధిస్తున్నట్టు ఎన్‌జీటీ చెన్నై బెంచ్ ప్రకటించింది. ఈ మేరకు 900 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.

మూడు నెల్లల్లోగా ఈ సొమ్మును కేఆర్‌ఎంబీ వద్ద డిపాజిట్‌ చేయాలని స్పష్టం చేసింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల విషయంలో ఇచ్చిన తీర్పునే ఇక్కడా అమలు చేస్తున్నట్టు ఎన్‌జీటీ చెప్పింది.


First Published:  22 Dec 2022 2:25 PM IST
Next Story