Telugu Global
Telangana

తెలంగాణలో పాత పద్ధతిలోనే టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌

గురువారం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గిన విద్యాశాఖ. గ్రేడింగ్‌ విధానం మాత్రం ఎత్తివేత

తెలంగాణలో పాత పద్ధతిలోనే టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌
X

రాష్ట్రంలో టెన్త్‌ క్లాస్‌ పరీక్షల్లో కీలక మార్పులు చేస్తూ విద్యాశాఖ గురువారం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఇంటర్నల్‌ మార్కుల తొలిగింపు ఈసారికి ఉండదని, వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి రాత పరీక్షకు 100 మార్కులు ఇచ్చే విధానం అమల్లోకి వస్తుందని శుక్రవారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గత ఏడాది అమలు చేసినట్లుగా ఇంటర్నల్‌ పరీక్షలకు 20, ఫైనల్‌ ఎగ్జామ్స్‌కు 80 మార్కుల కేటాయింపు విధానాన్నే ఈ ఏడాది అమలు చేస్తారు. తుది పరీక్షలకు ఇంకా మూడున్నర నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పుడు మార్పులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే గ్రేడింగ్‌ విధానాన్ని మాత్రం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎత్తివేయనున్నారు. గ్రేడింగ్‌కు బదులు మార్కులు కేటాయిస్తారు.

టెన్త్‌ క్లాస్‌ మార్కుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక మార్పులు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్‌ మార్కులు, 80 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నది. ఈసారి ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసినట్ల ఇకపై 100 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు జరనున్నట్లు చెప్పింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మార్పులకు అనుగుణంగా పరీక్షలు జరిగే సమయంలో విద్యార్థులకు ఇచ్చే ఆన్సర్‌ షీట్స్‌లోనూ సర్కార్‌ మార్పులు చేసింది. ఫిజిక్స్‌, బయాలజి సబ్జెక్టులకు 12 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. మిగతా సబ్జెక్టులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని అన్నిజిల్లాల విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే విమర్శల నేపథ్యంలో విద్యాశాఖ వెనక్కి తగ్గింది. సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.

First Published:  30 Nov 2024 7:20 AM IST
Next Story