చిట్టి నాయుడు చిప్ దొబ్బింది
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదానీని గజదొంగ అంటివి. మహారాష్ట్రలో గజదొంగ తెలంగాణలో సుద్దపూస అయ్యిండా? కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ తిట్టడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఫస్ట్రేషన్‌లో ఏదోదో మాట్లాడారని, చిట్టి నాయుడు చిప్ దొబ్బిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. హదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ సీఎం సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీటలో చేసిన వ్యాఖ్‌యలపై స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా బీఆర్‌ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన పనులు అంటూ ఏదో పిచ్చి రిపోర్టు విడుదల చేశారని ఎద్దేవా చేశారు. అవన్నీ బీఆర్‌ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్‌ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్‌ఎస్ ఇచ్చింది అంటారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఎంపీగా పనిచేసినోడికి ఈ మాత్రం తెలియదా? అని మండిపడ్డారు. ఇంత మూర్ఖంగా ప్రజల తెలివి తేటలను తక్కువగా అంచనా వేసి నోటికి వచ్చినట్లు వాగుతాను అన్నట్లు రేవంత్ వ్యవహారం ఉన్నదన్నారు. సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే అప్పటి సీఎం కేసీఆర్ తిరస్కరించారని నాటి పేపర్ క్లిప్‌లను మీడియాకు చూపెట్టారు. అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే.. మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది పాలన స్థూలంగా చెప్పాలంటే అదానీ కోసం, అల్లుడి ఫార్మా కంపెనీ కోసం, జగదీశ్, తిరుపతి అన్నల కోసం, బావ మరది సృజన్‌రెడ్డికి అమృతం పంచడం కోసమని పనిచేశారని ఆరోపించారు. ఇది తప్ప.. ఏడాది పాలనలో నువ్వు పీకిందేందీ చిట్టి నాయుడు? అని ప్రశ్నించారు. శాడిస్టువు, సన్నాసివిని నేను అనేకలేకనా? అని ధ్వజమెత్తారు. అంతేకాదు మరో విషయం సీఎం ను అడుగదలుచుకున్నాను. ఆయనేదో గొప్ప పనిచేసినట్లు స్కిల్ వర్సిటీ కోసం అదానీ అక్టోబర్ 14న చెక్ ఇచ్చాడని, ఆ చెక్‌ను మేము క్యాషే చేయలేదన్నారు. చెక్ ఇస్తే క్యాష్ చేసుకుంటారు. 38 రోజులు చెక్ ఎందుకు బ్యాంకులో వేయలేదు? ఆయన కు ఇచ్చే ఉద్దేశం లేదా నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశమైనా ఉండకపోయి ఉండాలన్నారు. లేకపోతే ఉత్తగ చెక్ చూపెట్టి వెనక ఉంచి డబ్బులైనా దొబ్బి ఉండాలని కేటీఆర్ ఆరోపించారు.
గుజరాత్ నుంచి వచ్చి మహారాష్ట్రలోని ధారావి భూమి ఎత్తుకపోతున్నడని అక్కడ మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదానీని గజదొంగ అంటివి. మహారాష్ట్రలో గజదొంగ తెలంగాణలో సుద్దపూస అయ్యిండా? రాహుల్ గాంధీ నెత్తి మీద నుంచి రెండు కొట్టగానే అదానీ ఫ్రాడ్ అని రేవంత్ రెడ్డికి నిన్ననే తెలిసిందన్నట్టు స్వాతిముత్యం యాక్టింగ్‌లు ఏమిటన్నారు. స్కిల్ వర్సిటీ రూ. 100 కోట్లు ఆయన ఇవ్వలేదు, న్వువు తీసుకోలేదు. ఆ సంగతి పక్కపెడితే . అదానీ గ్రూప్ తెలంగాణలో రూ 12,400 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పిందని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనిపై సీఎం నిన్న రెండు విషయాలు బైటపెట్టారు. అందులో ఒకటి పంప్‌డ్ స్టేరేజ్ యూనిట్. తెలంగాణలో ఇప్పటివరకు అలాంటి పాలసే లేదు. పాలసీ లేనప్పుడు అదానీ దగ్గరి నుంచి పైసలు ఎలా తీసుకుంటామనుకున్నావని ఫైర్ అయ్యారు. పాలసీ లేకుండా ప్రపోజల్ ఎలా తీసుకున్నావని నిలదీశారు. రెండో కొడంగల్ ఇన్నిరోజులు అల్లుని కోసమని అనుకున్నాం. అదానీ కోసమని ఇప్పుడే తెలిసిందన్నారు. కొడంగల్‌లో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంట్ ప్లాంట్ పెడతారు అన్నారు. రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ ప్లాంట్ పెట్టవదని అక్కడి ప్రజలు మర్లపడ్డారు. అక్కడ ప్లాంట్ పెట్టి మూసీలో కాలుష్యాన్ని వదులుతానని, అది అక్కడ ఉండగానే.. ఇప్పుడు కొడంగల్‌లో కొత్త దుకాణం తెరిచాడు. అందుకే మేము అంటున్నది అల్లుని కోసం, అదానీ కోసం, అన్నల కోసం, బావమరిదికి అమృతం పంచడానికే రేవంత్ పనిచేస్తున్నానడి అంటున్నామన్నారు.