Telugu Global
Telangana

అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలి

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువు దృష్టిలో పెట్టుకుని స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు సీజే ధర్మాసనం

అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలి
X

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. 10వ షెడ్యూల్‌ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్నది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువు దృష్టిలో పెట్టుకుని స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్‌లను స్పీకర్‌ స్వీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్‌ 9న దీన్ని విచారించిన సింగిల్‌ జడ్జి.. 4 వారాల్లో అనర్హత పిటిషన్‌లపై షెడ్యూల్‌ ఖరారు చేయాలని తీర్పు వెలువరించింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై ఇటీవల వాదనలు ముగియగా తీర్పును వాయిదా వేసింది. తాజాగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలంటూ శుక్రవారం ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

First Published:  22 Nov 2024 11:46 AM IST
Next Story