Telugu Global
Andhra Pradesh

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు : వైవీ. సుబ్బారెడ్డి

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు : వైవీ. సుబ్బారెడ్డి
X

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏపీ పోలీసులు వేధిస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతి పార్టీ కార్యకర్తకు మేము అండగా ఉండమని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్ట్ చేయకుండా ఐదు రోజులు నిర్బంధించారని సుబ్బారెడ్డి అన్నారు. మా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశాలన్నింటిని మానవ హక్కుల సంఘం లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

వైసీపీ కార్యకర్తలను హింసించి వారి నుంచి అనుకూల స్టేట్ మెంట్ల ను తీసుకుంటున్నారు. తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కోరినట్టు తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. ఈ విషయంలో మానవ హక్కుల పరిరక్షణ సమితి స్పందించాలని కోరారు. వైసీపీ కి చెందిన 57 మంది సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు అని తెలిపారు. 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదన్నారు.

First Published:  12 Nov 2024 5:24 PM IST
Next Story