ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత కె. కేశవరావు సభ్యులుగా కమిటీ ఏర్పాటు
BY Raju Asari8 Nov 2024 5:17 PM GMT
X
Raju Asari Updated On: 8 Nov 2024 5:17 PM GMT
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత కె. కేశవరావు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేబినెట్ సబ్ కమిటీ వేసి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి సీఎం హామీ ఇచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. త్వరగా సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
Next Story