Telugu Global
Telangana

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు చేయాలి : కిషన్ రెడ్డి

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు చేయాలి : కిషన్ రెడ్డి
X

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని.. అంగన్‌వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు. హైదరాబాద్‌లో మురికివాడలు పెరిగిపోతున్నాయిని కిషన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. అయినా, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ మూతబడే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి’’ అని కిషన్‌రెడ్డి సూచించారు. రేపటి తెలంగాణ వ్యాప్తంగా పంట కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించానున్నారు.

First Published:  8 Nov 2024 2:27 PM GMT
Next Story