సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్పని రాహుల్ గాంధీ
సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాక్షలు కూడా చెప్పలేదు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాక్షలు కూడా చెప్పలేదు. కొంత కాలంగా సీఎంపై రాహుల్ గరంగా ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. 3 నెలలుగా ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రుణమాఫీ సభలకు సీఎం రేవంత్ రెడ్డి పిలిచినా రాహుల్ గాంధీ రాలేదు. అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ రాహుల్ గాంధీ ఆగ్రహానికి కారణం అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి ఇవాళ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డికి విషెస్ చెప్పారు. కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చారు. ప్రధాని తెలిపిన బర్త్‌డే విషెస్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. మీ విషెస్‌కు ధన్యవాదాలు అంటూ రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేశారు. ప్రధానితో పాటుగా రేవంత్‌రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రేవంత్‌రెడ్డి మరెన్నో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు.