Telugu Global
Telangana

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

మల్లారెడ్డి పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు

మాజీ మంత్రి మల్లారెడ్డికి  ఈడీ నోటీసులు
X

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. గత సంవత్సరం జూన్‌లో మల్లారెడ్డిపై సోదాలు జరిపిన ఈడీ కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేసినట్లు గుర్తించారు.

మొత్తంగా రాష్ట్రంలోని పది ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 45 సీట్లు బ్లాక్ చేసి అమ్మకున్నట్లు ఈడీ గుర్తించింది. మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరుతూ ఈడీ అధికారులు నోటీసులు అందించారు. కాగా, ఈడీ నోటీసులు మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రాష్ట్రంలో మొత్తం 10 మెడికల్ కాలేజీల్లో 45 సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ గుర్తించింది.

First Published:  7 Nov 2024 2:46 PM IST
Next Story