Telugu Global
Telangana

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన విద్యాశాఖ కార్యదర్శి

ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన విద్యాశాఖ కార్యదర్శి
X

ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని గురుకుల విద్యా సంస్థలు, ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ చార్జీలను భారీగా పెంచింది. డైట్ చార్జీల విషయంలో తమ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు యథావిధిగా అమలు చేయడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే డైట్ లో పోషకాహారం ఉండేలా మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. పదిరోజుల్లో కొత్త డైట్ ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు 40 శాతం మేరకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలన్న అధికారుల నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రియథాతథంగా ఆమోదించారు.ఈ పెంపుదల వల్ల రాష్ట్రంలో 7,65,705 మంది విద్యార్థినీ విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది.

First Published:  1 Nov 2024 4:24 PM IST
Next Story