Telugu Global
Telangana

కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు స్పందించిన కేంద్ర మంత్రి

కేటీఆర్‌ పేరును తాను ఎక్కడా ప్రస్తావించలేదన్న బండి సంజయ్‌

కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు స్పందించిన కేంద్ర మంత్రి
X

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జారీచేసిన లీగల్‌ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సమాధానం ఇచ్చారు. లీగల్‌ నోటీసులో కేటీఆర్‌ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, నిరాధారమైనవి పేర్కొన్నారు. కేటీఆర్‌ పేరును తాను ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. తన పరువుకు భంగం కలించే వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆయనకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపిన విషయం విదితమే. ఫోన్‌ ట్యాన్‌ ట్యాపింగ్‌, డ్రగ్స్‌ వ్యవహారాల్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. వారంలోపు క్షమాపణలు చెప్పకపోతే లీగల్‌ యాక్షన్‌ తప్పదన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని కృషి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏలోఓ నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రధాని మోడీ రెండేళ్ల కిందట రోజ్‌గార్‌ మేళా ప్రారంభించారు. పది లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. రెండేళ్లలో 8 లక్షల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చారు అని తెలిపారు. విశాఖపట్నంలో ఇంకా ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది మోదీ ప్రభుత్వమే అని సంజయ్‌ అన్నారు.

First Published:  29 Oct 2024 1:09 PM IST
Next Story