Telugu Global
Telangana

నేషన్‌ ఫస్ట్‌ అనేది గుర్తుంచుకుని పనిచేస్తేనే దేశాభివృద్ధి

విద్యుదుత్పత్తి పెంచి అన్నిరంగాల అభివృద్ధికి సహకరిస్తున్నామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

నేషన్‌ ఫస్ట్‌ అనేది గుర్తుంచుకుని పనిచేస్తేనే దేశాభివృద్ధి
X

శాంతిభద్రతలు సరిగా లేకుంటే దేశంలోకి పెట్టుబడులు రావని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ విద్యాభవన్‌ పాఠశాలలో రోజ్‌గార్‌ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. తల్లిదండ్రులు, మాతృభాష, పుట్టిన ఊరును మరిచిపోకూడదన్నారు. నేషన్‌ ఫస్ట్‌ అనేది గుర్తుంచుకుని పనిచేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మన్‌ కీ బాత్‌లో ఆలిండియా రేడియో ప్రాధాన్యాన్ని మోదీ పెంచారు. పోస్టాఫీసులు నిర్వీర్యం కాకుండా కాపాడుతున్నాం. ఉగ్రవాద చర్యలు, అశాంతి వాతావరణంలో పెట్టుబడులు రావన్నారు. అందుకేఉగ్రవాద చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. సైనికులతో కలిసి దీపావళి చేసుకోవాలని ప్రధాని మమ్మల్ని కోరినట్లు చెప్పారు. పదేళ్లుగా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఏకైక ప్రధాని మోడీ అని కొనియాడారు.

వికసిత్‌ భారత్‌ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. వచ్చే 25 ఏళ్ల పాటు మనకు అమృతకాలమని ప్రధాని మోడీ అంటారు. యువశక్తి సాయంతో మనం ఎన్నో అద్భుతాలు చేయవచ్చన్నారు. అనేక దేశాల్లో యువత తగ్గుతున్నదని, కానీ మన వద్ద పుష్కలంగా ఉందన్నారు. ఇవాళ మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. వ్యవసాయ విధానాల్లో మార్పులు తెస్తున్నామన్న, కిషన్‌రెడ్డి విద్యుత్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుదుత్పత్తి పెంచి అన్నిరంగాల అభివృద్ధికి సహకరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన 155 మంది యువతకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఇప్పటికే 9 లక్షల మందికి నియామకపత్రాలు అందించామన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 51 వేల మందికి నియామపత్రాలు ఇస్తున్నామని వెల్లడించారు.

దిగుమతులు తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. భారత్‌ను ఉత్పత్తుల తయారీ హబ్‌గా తయారు చేస్తున్నాం. రక్షణశాఖ పరికరాలను ఎక్కువగా దేశంలోనే తయారుచేస్తున్నామన్నారు. ఇతర దేశాలకు రక్షణ పరికరాలు, సెల్‌ఫోన్లు ఎగుమతి చేస్తున్నామని, ప్రపంచాన్ని శాసించేస్థాయికి భారత్‌ చేరాలన్నదే మా లక్ష్యమన్నారు.

First Published:  29 Oct 2024 10:31 AM IST
Next Story