Telugu Global
Telangana

కానిస్టేబుళ్ల భార్యలు ధర్నా చేసినందుకు భర్తలు సస్పెండ్

న‌ల్ల‌గొండ‌లోని 12వ బెటాలియ‌న్‌లో కానిస్టేబుళ్ల‌ స‌స్పెన్ష‌న్‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కానిస్టేబుళ్ల  భార్యలు ధర్నా చేసినందుకు భర్తలు సస్పెండ్
X

కానిస్టేబుళ్ల భార్యలు రోడ్డెక్కితే భర్తలను స‌స్పెండ్ చేసే రూల్ ఎక్కడా లేదని తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌ల్ల‌గొండ‌లోని 12వ బెటాలియ‌న్‌లో కానిస్టేబుళ్ల‌ స‌స్పెన్ష‌న్‌పై ఆర్ఎస్పీ స్పందించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. పోలీసు కానిస్టేబుళ్ల‌ సస్పెన్షన్‌ను త‌క్ష‌ణ‌మే ఎత్తేయాల‌ని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర 12వ బెటాలియన్‌ వద్ద.. పోలీసుల సతీమణులు నిరసన చేపట్టారు. వారి భర్తలపై పనిభారం తగ్గించాలని, అర్దర్లి వ్యవస్థను రద్దు చేయాలని, కామన్ మెస్ తీసివేయాలని వారు డిమాండ్ చేశారు.

రూల్ కాల్ వ్యవస్థను సివిల్ ఆర్ మాదిరిగానే పెట్టాలని, కొత్తగా వచ్చే రికార్డు పద్ధతి ఉపసంహరించుకోవాలని బెటాలియన్ కార్యాలయం ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గత బీఆర్‌ఎస్ హయంలో స్పెషల్ కానిస్టేబుల్స్ 15 రోజులు డ్యూటీ చేస్తే, 4 రోజులు లీవ్ ఉండేవి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 26 రోజులు కంటిన్యూ డ్యూటీ చేస్తే, 4 రోజులు సెలవులు ఇస్తామని అంటున్నార‌ని ఆర్ఎస్పీ తెలిపారు. ఇక తెలంగాణలో రోజురోజుకు శాంతిభ‌ద్ర‌త‌లు దిగజారిపోతున్నాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్రానికి హోం మంత్రి లేడు.. సీఎం రేవంత్ వద్దనే హోం శాఖ‌ ఉంది. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ముఖ్యమంత్రి ఎన్నిక‌ల ముందు ఏక్ పోలీసు నినాదం అన్నారు. మ‌రి ఏక్ పోలీసు నినాదం ఏమైంది రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్పీ ప్ర‌శ్నించారు.

First Published:  23 Oct 2024 6:04 PM IST
Next Story