Telugu Global
Telangana

సినిమాలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుత సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో ఏహీరోతోనూ తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తానేవరితోను పోటీ లేదన్నారు. ఏపీలో కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు.

సినిమాలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

ప్రస్తుత సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో ఏహీరోతోనూ తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తానేవరితోను పోటీ లేదన్నారు. ఏపీలో కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు. అందరు హీరోలు బాగుండాలి, మంచి సినిమాలు‌చేయాలి. ముందు బాధ్యతతో పని చేయాలి. ఆ తరువాత వినోదం తప్పకుండా ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలే అజెండాగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని పవన్ పేర్కొన్నారు. టాలీవుడ్‌‌లోని అగ్ర హీరోలు చిరంజీవి, బాలయ్య, అల్లు అర్జున్‌, ప్రభాస్‌ అందరూ బాగుండాలి.. అందరి సినిమాలు ఆడలని కోరారు. నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలని తెలిపారు. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటానని చెప్పారు. మూవీస్ బాగుండాలంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ బాగుండాలని వెల్లడించారు. రాష్ట్రాన్ని బాగు చేసుకుని ఆ తరువాత విందులు వినోదాలు చేసుకుందామన్నారు. నెల రోజుల్లోపు ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.

కూటమి సర్కార్‌లో ప్రజల సమస్యలే అజెండాగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి చూస్తాం. పవన్ కళ్యాణ్ దగ్గరే డబ్బులు ఉన్నాయని చంద్రబాబుకు అధికారులు‌ చెప్పారట. నేను ఆరా తీస్తే ... ఉపాధి హామీ పథకం ద్వారా ఏడాదికి వచ్చే రూ.పది వేల‌ కోట్ల నిధుల గురించి మాట్లాడినట్లు తెలిసింది" అని పవన్ అన్నారు. కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంటు రోడ్లు, రూ. 4.15 లక్షలతో రెండు గోకులాలు, పునాదిపాడులో రూ.54 లక్షలతో రెండు సిమెంటు రోడ్ల నిర్మాణానికి పవన్‌కళ్యాణ్‌ శంకుస్థాపన చేశారు. కంకిపాడు-రొయ్యూరు వయా గూడవర్రు రోడ్డు నవీకరణ చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తున్నానని ప్రకటించారు. నిదురుమొండి నుంచీ బ్రహ్మయ్యగారి మూలం, నాగాయలంక వరకూ గ్రామాల ప్రజలు వరద బారిన పడ్డారని కలెక్టర్ తెలిపిన ప్రకారం రోడ్లు వేయాలని పంచాయతిరాజ్ అధికారులను పవన్ ఆదేశించారు.

First Published:  14 Oct 2024 11:10 AM GMT
Next Story