నెల రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్
ప్రజలందరికీ మెరుగైన విద్యా, వైద్య సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, గురువారం విద్యానగర్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ రెనెవా క్యాన్సర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
BY Vamshi Kotas26 Sept 2024 6:21 PM IST
X
Vamshi Kotas Updated On: 26 Sept 2024 7:37 PM IST
మరో 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకోచ్చేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యానగర్‌లో దుర్గబాయి దేశ్ ముఖ్ రెనోవా కాన్సర్ ఆస్పత్రిని సీఎం ప్రారంభించారు. సామాన్య ప్రజలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపు వల్లే దేశంలో వైద్య రంగం గణనీయమైన అభివృద్ది సాధించిందన్నారు.
క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కువని.. క్యాన్సర్ వ్యాధికి వైద్య సదుపాయాలు మన దగ్గర తక్కువగా ఉన్నాయని, చికిత్సకు అయ్యే ఖర్చు మాత్రం సామాన్యులకు అందుబాటులో లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మరిన్ని క్యాన్సర్ ఆసుపత్రులు రావాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రోఫైల్స్ డిజిటల్ చేయాల్సి ఉందని సీఎం తెలిపారు.
Next Story