కమిషనర్ కి సారీ చెప్పిన పోలీస్ జంట.. ఎందుకంటే..?
వెడ్డింగ్ షూట్ తో డిపార్ట్ మెంట్ ని వార్తల్లో నిలిపినందుకు వారిద్దరూ కమిషనర్ కు క్షమాపణలు చెప్పారు. ఇంకెప్పుడూ డిపార్ట్ మెంట్ విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకోబోమన్నారు.
ఇటీవల పోలీస్ యూనిఫామ్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి వైరల్ గా మారిన పోలీస్ జంట, హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ని కలిశారు. కొత్తగా పెళ్లైన ఆ జంటకు కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో వెడ్డింగ్ షూట్ తో డిపార్ట్ మెంట్ ని వార్తల్లో నిలిపినందుకు వారిద్దరూ కమిషనర్ కు క్షమాపణలు చెప్పారు. ఇంకెప్పుడూ డిపార్ట్ మెంట్ విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకోబోమన్నారు.
Met the newly wed cop couple who’s prewedding shoot went viral and created controversy. Congratulated them and reminded them to uphold the honour of the uniform, even in personal celebrations. They apologised for embarrassing the department.
— CV Anand IPS (@CVAnandIPS) September 22, 2023
Wished them a lifetime of love and… https://t.co/CjFAfV6REr pic.twitter.com/rh1PJENwEa
అసలేం జరిగింది..?
ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్, పంజాగుట్ట ఎస్సై భావన.. ఇద్దరూ ఇటీవల పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వారిద్దరూ ప్రీవెడ్డింగ్ షూట్ లో పాల్గొన్నారు. యూనిఫామ్ లో డ్యూటీ చేస్తున్నట్టుగా, పోలీస్ జీపు దిగుతున్నట్టుగా ఆ ప్రీవెడ్డింగ్ షూట్ లో కొన్ని సీన్లు ఉన్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిపార్ట్ మెంట్ ప్రాపర్టీస్ ని వ్యక్తిగత అవసరాలకోసం వినియోగించుకున్నారంటూ వారిపై విమర్శలు వచ్చాయి. పోలీస్ యూనిఫామ్ తో వెడ్డింగ్ ఫొటోషూట్ ఏంటని కొంతమంది కామెంట్లు పెట్టారు. దీనిపై డిపార్ట్ మెంట్ తరపున కమిషనర్ సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. పోలీస్ జంటకు మద్దతుగా నిలిచారు. వారు పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రాపర్టీస్ ని తప్పుగా ఉపయోగించలేదని చెప్పారు. అయితే ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ఉంటే బాగుండేదన్నారు.
అక్కడ సీన్ కట్ చేస్తే.. పెళ్లైన తర్వాత వారిద్దరూ తాజాగా కమిషనర్ సీవీ ఆనంద్ ని కలిశారు. వారికి పూలబొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు కమిషనర్. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. వ్యక్తిగత ఫంక్షన్లలో కూడా పోలీస్ యూనిఫామ్ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్త జంట తాము చేసిన వెడ్డింగ్ షూట్ విషయంలో కమిషనర్ కు సారీ చెప్పారు. ఇంకెప్పుడూ అలా వ్యక్తిగత అవసరాలకోసం పోలీస్ యూనిఫామ్ ని ఉపయోగించబోమన్నారు.