న్యూయార్క్,లండన్ నగరాల్లో విద్యుత్తు అంతరాయం ఉండొచ్చు కానీ హైదరాబాద్ లో ఉండదన్న కేసీఆర్
మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు నిర్మించబోయే మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేసీఆర్ కొద్ది సేపటి క్రితం శంఖుస్థాపన చేశారు. అనంతరం పోలీసు అకాడమీ లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
న్యూయార్క్ , లండన్ పట్టణాల్లో కరెంట్ పోవచ్చునేమో కానీ హైదరాబాద్ లో మాత్రం ఎప్పుడూ కరెంట్ పోదు అని, 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సప్లై జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు నిర్మించబోయే మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేసీఆర్ కొద్ది సేపటి క్రితం శంఖుస్థాపన చేశారు. అనంతరం పోలీసు అకాడమీ లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ..
''హైదరాబాద్ నగరం చరిత్రలో సుప్రసిద్దమైన నగరం. ఒకప్పుడు ఢిల్లీకన్నా పెద్ద నగరం ఇది.మద్రాసుకు 1927 లో విద్యుత్తు వస్తే హైదరాబాద్ కు 1912 లోనే విద్యుత్తు వచ్చింది. అనేక కులాలు, మతాలు, దేశాల ప్రజలు నివసిస్తున్న కాస్మోపాలిటన్ సిటీ ఇది.'' అని కేసీఆర్ తెలిపారు.
చరిత్రలోనే కాదు వర్తమానంలో కూడా హైదరాబాద్ చాలా గొప్పనగరమన్నారు కేసీఆర్.సమశీతోష్ణ స్థితి వాతావరణం ఉన్న, భూకంపాలు రాని నగరం హైదరాబాద్ అని ఆయన అన్నారు
సమైక్య పాలనలో హైదరాబాద్ నగరం అభివృద్ది చెందాల్సినంతగా చెందలేదు. కరెంటు కోతలు, మంచి నీళ్ళ కొరత వంటి అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆ సమస్య లేదు. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చాం. ప్రతి ఇంటికీ మంచి నీళ్ళు ఇస్తున్నాం. పరిశ్రమలు పెరిగాయి.'' అని కేసీఆర్ పేర్కొన్నారు.
''ప్రపంచంలో కాలుష్య నివారణకు, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి ఒకే ఒక మార్గం మెట్రో రైలు. కేంద్ర సహకారం లేకపోయినా సరే హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో తీసుకవస్తాం. '' అని కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్ జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది అందుకు తగ్గట్టు మౌలిక సౌకర్యాలు కూడా అభివృద్ది చేస్తూ ఉండాలి. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అద్వర్యంలో మరిన్ని విజయాలు సాధించాలి. హైదరాబాద్ ను మరింతగా అభివృద్ది చేయాలి అని కేసీఆర్ అన్నారు.