Telugu Global
Telangana

న్యూ ఇయర్‌ కిక్‌.. రూ.750 కోట్ల లిక్కర్ సేల్స్..!

ఆదివారం దాదాపు రెండు లక్షల కేసుల మద్యం డిపోల నుంచి తరలించినట్లు TSBC తెలిపింది. చాలావరకు మద్యం దుకాణాలు డిసెంబర్‌ 30నే వీలైనంత మద్యాన్ని తీసుకెళ్లినట్లు లెక్కలు చెప్తున్నాయి.

న్యూ ఇయర్‌ కిక్‌.. రూ.750 కోట్ల లిక్కర్ సేల్స్..!
X

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణలో లిక్కర్‌ సేల్స్ అమాంతం పెరిగాయి. దీంతో సర్కార్ ఖజానాకు భారీగా ఆదాయం చేకూరింది. డిసెంబర్ 28-31 తేదీ వ‌ర‌కు దాదాపు రూ.750 కోట్ల మద్యం అమ్ముడైనట్లు తెలంగాణ స్టేట్ బేవరెజెస్‌ కార్పొరేషన్ లెక్కలు చెప్తున్నాయి.

డిసెంబర్‌ 28న రూ.133 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, డిసెంబర్ 29న రూ.179 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో దాదాపు రూ.313 కోట్ల విలువైన మద్యం సేల్ అయ్యింది. డిసెంబర్‌ 31న రూ.150 కోట్ల విలువైన మద్యం అమ్ముడుకావొచ్చని TSBC అంచనా వేస్తోంది. న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కాకముందే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రూ.625.7 కోట్ల విలువైన మద్యం అమ్ముడై కొత్త రికార్డులు నమోదయ్యాయి.

డిసెంబర్‌ 28న 2 లక్షల 72 వేలు, డిసెంబర్‌ 29న 3 లక్షల 58 వేలు, డిసెంబర్ 30న 5.8 లక్షల కేసుల మద్యం అమ్ముడైనట్లు TSBC స్పష్టం చేసింది. ఇక ఆదివారం దాదాపు రెండు లక్షల కేసుల మద్యం డిపోల నుంచి తరలించినట్లు TSBC తెలిపింది. చాలావరకు మద్యం దుకాణాలు డిసెంబర్‌ 30నే వీలైనంత మద్యాన్ని తీసుకెళ్లినట్లు లెక్కలు చెప్తున్నాయి. డిసెంబర్‌ 30న మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. డిసెంబర్‌ 30న ఒక్కరోజే 3 వేల 729 కేసుల వైన్, 2.9 లక్షల కేసుల బీర్లు, 2.92 లక్షల కేసుల ఇతర మద్యం అమ్ముడైంది.

గతేడాది డిసెంబర్ 30న 3.31 లక్షల కేసుల మద్యం అమ్ముడవగా.. ఈ ఏడాది అది 5.8 లక్షల కేసులకు పెరిగింది. గతేడాది డిసెంబర్ 30న రూ.254 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ. 313 కోట్ల ఆదాయం వచ్చింది.

First Published:  1 Jan 2024 11:23 AM IST
Next Story