Telugu Global
Telangana

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు జరిమానా, 6 నెలల జైలు

హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక ఆంక్షలు ఉంటాయన్నారు డీజీపీ. ఫ్లైఓవర్‌లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR)పై వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు జరిమానా, 6 నెలల జైలు
X

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇవాళ రాత్రి 8 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, డ్రగ్స్‌ డిటెక్షన్ టెస్టులు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు డీజీపీ రవి గుప్తా. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం జరిమానాలు, జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. డ్రంకన్‌ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేల జరిమానాతో పాటు 6 నెలల‌ జైలు శిక్ష విధించనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌ పరిధిలో 5 చెక్‌పాయింట్స్‌ ఏర్పాటు చేశారు.

ఇక హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక ఆంక్షలు ఉంటాయన్నారు డీజీపీ. ఫ్లైఓవర్‌లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR)పై వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు తప్పనిసరిగా పాస్‌లు కలిగి ఉండాలని సూచించారు.

క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు చేశారు పోలీసులు. తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, రైడ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని కోరారు. పబ్‌లు, క్లబ్‌లలో మద్యం సేవించిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు.

First Published:  31 Dec 2023 2:53 PM IST
Next Story