Telugu Global
Telangana

తెలంగాణలో డిగ్రీ కొత్త సబ్జెక్ట్ లు..

బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో నాలుగో సెమిస్టర్‌ లో సైబర్ సెక్యూరిటీని ప్రవేశపెడుతున్నారు. ఈ సబ్జెక్ట్ కి 4 క్రెడిట్లు కూడా ఇచ్చారు.

తెలంగాణలో డిగ్రీ కొత్త సబ్జెక్ట్ లు..
X

సంప్రదాయ డిగ్రీకోర్సుల్లో కొత్త సబ్జెక్ట్ లు ప్రవేశ పెడుతూ విద్యార్థులకు నూతన సమాచారాన్ని మరింత చేరువ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడాది నుంచి డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ అనే కొత్త సబ్జెక్ట్ ని ప్రవేశపెడుతున్నారు. లాంఛనంగా ఈ సబ్జెక్ట్ ని డిగ్రీలో ప్రవేశ పెట్టారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉపాధికి, సమాజానికి అవసరయ్యే కొత్త కోర్సులను భవిష్యత్తులో మరిన్ని ప్రవేశ పెడతామని తెలిపారామె.

నాలుగో సెమిస్టర్ లో సైబర్ సెక్యూరిటీ..

బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో నాలుగో సెమిస్టర్‌ లో సైబర్ సెక్యూరిటీని ప్రవేశపెడుతున్నారు. ఈ సబ్జెక్ట్ కి 4 క్రెడిట్లు కూడా ఇచ్చారు. ఈ ఏడాది నుంచే తెలంగాణలోని కాలేజీల్లో ఈ సబ్జెక్ట్ ని చెబుతారు. ముందుగానే సంబంధిత లెక్చరర్లకు ఈ సబ్జెక్ట్ పై అవగాహన కల్పించామని చెప్పారు ఉన్నతాధికారులు. సైబర్ నేరాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి, సైబర్ నేరగాళ్లబారిన పడకుండా ఉండేందుకు, సైబర్ నేరాల నుంచి తమని తాము కాపాడుకోవడమే కాకుండా, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, ఇతరులకు అవగాహన పెంచేలా ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సును రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.

మూల్యాంకన పద్ధతుల్లో మార్పులు..

ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై ఐఎస్బీ చేసిన సిఫార్సుల నివేదికను కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. బోధన మూస పద్ధతిలో కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారామె. ఐఎస్బీ సిఫారసులను అధ్యయనం చేసి, అమలు చేయాలని ఉన్నత విద్యామండలికి మంత్రి సబిత సూచించారు.

First Published:  11 Sept 2023 8:18 PM IST
Next Story