Telugu Global
Telangana

అంగన్‌వాడీలకు కొత్త చీరలు

డిజైన్‌ల పై అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లతో మంత్రి సీతక్క సమావేశం

అంగన్‌వాడీలకు కొత్త చీరలు
X

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కొత్త చీరలు అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం సెక్రటేరియట్‌ లో కొత్త చీరల కలర్‌, డిజైన్‌ల ఎంపికపై అంగన్‌వాడీల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాము తెప్పించిన చీరలను అంగన్‌వాడీలకు చూపించి అభిప్రాయాలు కోరారు. గతంలో ఇచ్చిన చీరలకన్నా నాణ్యమైనవి ఇవ్వాలని, కలర్‌, డిజైన్‌లలో పలు మార్పులు చేయాలని అంగన్‌వాడీలు సూచించారు. అందరి అభిప్రాయాల మేరకే కొత్త చీరలు త్వరలోనే పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కు సంబంధించిన జీవో పది రోజుల్లో వస్తుందన్నారు. అంగన్‌వాడీలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. చంటిబిడ్డల తల్లులు పనులు చేసుకునేందుకు క్రచ్‌ లు దోహద పడుతాయన్నారు. క్రచ్‌ లతో అంగన్‌వాడీ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అంగన్‌వాడీలకు అనుబంధంగానే అవి కొనసాగుతాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత కరెంట్‌ ఇస్తామన్నారు.

First Published:  4 Nov 2024 12:02 PM GMT
Next Story