Telugu Global
Telangana

పాత గోడకు కొత్త సున్నం.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

ఓ తమ్ముడు ఆస్ట్రేలియాలో పర్యటిస్తే, మరో తమ్ముడు అమెరికా నుంచి పెట్టుబడులు పెడుతారట అంటూ విమర్శలు చేశారు. కాగ్నిజెంట్ విస్తరణకు గతంలోనే బీఆర్ఎస్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. పాత గోడకు కొత్త సున్నం కొట్టినట్లు రేవంత్ తీరు ఉందన్నారు కేటీఆర్.

పాత గోడకు కొత్త సున్నం.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
X

తెలంగాణలో ఒకేసారి మూడు ఉపఎన్నికలు రాబోతున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తప్పకుండా ఉపఎన్నిక వస్తుందని, ఆ ఎన్నికలో రాజయ్య గెలుపు ఖాయమన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని.. సానుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు.

కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్న కేటీఆర్.. 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్‌, రేవంత్ మాత్రం చెరో ఉద్యోగం దక్కించుకున్నారని సెటైర్లు వేశారు. జాబ్‌ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. బీఆర్ఎస్‌ది కుటుంబ పాలన అంటూ గతంలో విమర్శలు చేశారని, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ సోదరులే కనిపిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ఓ తమ్ముడు ఆస్ట్రేలియాలో పర్యటిస్తే, మరో తమ్ముడు అమెరికా నుంచి పెట్టుబడులు పెడుతారట అంటూ విమర్శలు చేశారు. కాగ్నిజెంట్ విస్తరణకు గతంలోనే బీఆర్ఎస్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. పాత గోడకు కొత్త సున్నం కొట్టినట్లు రేవంత్ తీరు ఉందన్నారు కేటీఆర్.


కవిత బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్.. బీజేపీతో కలిస్తే కవిత 150 రోజులుగా జైలులో ఎందుకు ఉంటుందని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టును తామే కట్టామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని, రిజర్యాయర్లు కట్టింది, పంప్‌హౌజ్‌లు పెట్టింది బీఆర్‌ఎస్సేనన్నారు. పీఆర్ స్టంట్లతో ప్రజలను ఎక్కువ రోజులు కన్‌ఫ్యూజ్‌ చేయలేరన్నారు కేటీఆర్. త్వరలోనే పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు కేటీఆర్.

First Published:  15 Aug 2024 1:08 PM GMT
Next Story