Telugu Global
Telangana

తెలంగాణలో కొలువుల జాతర.. గ్రూప్-4 నోటిఫికేషన్, మెడికల్ కాలేజీల్లో కొత్తగా 3,897 పోస్టులు

ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి గురువారం టీఎస్‌పీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-4 కేటగిరీలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు.

తెలంగాణలో కొలువుల జాతర.. గ్రూప్-4 నోటిఫికేషన్, మెడికల్ కాలేజీల్లో కొత్తగా 3,897 పోస్టులు
X

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. కొన్ని నెలల క్రితం సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా భారీగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి నిత్యం శాఖల వారీగా నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేస్తూ వస్తోంది. దాంతో పాటు పోలీస్ రిక్రూట్‌మెంట్ కూడా మరోవైపు కొనసాగుతున్నది. ఇదిలా ఉండగానే ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి గురువారం టీఎస్‌పీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-4 కేటగిరీలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు.

డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఇక ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్దతిలో పలు శాఖలకు చెందిన గ్రూప్-4 పోస్టులు దీని ద్వారా భర్తీ చేయనున్నారు. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి.

శాఖల వారీగా పోస్టులు :

1. అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్‌మెంట్ - 44 పోస్టులు

2. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్‌మెంట్ అండ్ ఫిషరీస్ - 2

3. బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ - 307

4. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్ - 72

5. ఎనర్జీ డిపార్ట్‌మెంట్ - 2

6. ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ - 23

7. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ - 255

8. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ - 5

9. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ - 338

10. హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ - 742

11. హోమ్ డిపార్ట్‌మెంట్ - 133

12. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్ - 7

13. ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ - 51

14. లేబర్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ - 128

15. మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ - 191

16. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ - 2701

17. పంచాయతి రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ - 1245

18. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ - 2

19. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ - 2077

20. ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ - 474

21. సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ - 97

22. ట్రాన్స్‌పోర్ట్, ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్ - 20

23. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ - 221

24. వుమెన్, చిల్డ్రెన్, డిసేబుల్డ్, సీనియర్ సిటిజన్స్ డిపార్ట్‌మెంట్ - 18

25. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చరల్ డిపార్ట్‌మెంట్ - 13

మొత్తం : 9168

మెడికల్ కాలేజీల్లో కొత్తగా 3,897 పోస్టులు:

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ఒక్కో మెడికల్ కాలేజీలో 433 కొత్త పోస్టులను క్రియేట్ చేయడానికి పచ్చ జెండా ఊపింది. దీంతో 9 మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. తొమ్మిది వైద్య కళాశాలలతో పాటు అనుబంధ ఆసుపత్రుల్లో ఈ ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ట్విట్టర్‌లో వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీ ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్‌లోని మెడికల్ కాలేజీలు, అనుబంధ హాస్పిటల్స్‌లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. వైద్య కళాశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు చేయడంపట్ల మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందని అన్నారు. అందరికీ సరైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని హరీశ్ రావు చెప్పారు.

First Published:  1 Dec 2022 5:48 PM IST
Next Story