త్వరలోనే రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీ
విద్యుత్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలను తీసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామన్న డిప్యూటీ సీఎం
BY Raju Asari3 Nov 2024 8:50 PM IST

X
Raju Asari Updated On: 3 Nov 2024 8:50 PM IST
త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలను తీసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామన్నారు. ఆదివారం ఆయన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మే నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్ కు అనుసంధానిస్తామన్నారు. రాష్ట్రంలో డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నాం. 2028-29 నాటికి విద్యుత్ డిమాండ్ 22,488 మెగావాట్లకు చేరొచ్చు అన్నారు. 2034-35 నాటికి డిమాండ్ 31,809 మెగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు. మార్పులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని ప్రవేశపెడుతున్నామని భట్టి వివరించారు.
Next Story