Telugu Global
Telangana

ఆయన 'గుళమెత్త'లేదు మహాప్రభో.. గళమెత్తారు.. బండి సంజయ్ ని ఆటాడుకుంటున్న నెటిజనులు

బండి సంజయ్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ పోస్టర్ లో , ''అణగారిన జీవితాలకు ఆలంబన.. ఆత్మాభిమానపు 'స్వాలంబన'.. భారతజాతి స్వేచ్ఛాపతాక సమత 'గుళమెత్తి'న చైతన్య గీతిక.. జాతి జనుల భవిత కోసం దారిచూపిన జయకేతనం.. భారత 'రాజ్యాంగు' రచనా చేతనం.. వారే మన బాబాసాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నమస్సుమాంజలులు అర్పిస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు'' అని రాసుంది.

ఆయన గుళమెత్తలేదు మహాప్రభో.. గళమెత్తారు.. బండి సంజయ్ ని ఆటాడుకుంటున్న నెటిజనులు
X

అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చాలా గొప్పగా, కవితాత్మకంగా ట్వీట్ చేయాలనుకొని బొక్కబోర్లా పడ్డారు. అనేక తప్పులతో ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ చూసిన నెటిజనులు బండిని ఆటాడుకున్నారు. అది చూసిన బండి పోస్టును డిలీట్ చేసి కొత్తది పెట్టినా మళ్ళీ తప్పులే..

బండి సంజయ్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ పోస్టర్ లో ''అణగారిన జీవితాలకు ఆలంబన.. ఆత్మాభిమానపు 'స్వాలంబన'.. భారతజాతి స్వేచ్ఛాపతాక సమత 'గుళమెత్తి'న చైతన్య గీతిక.. జాతి జనుల భవిత కోసం దారిచూపిన జయకేతనం.. భారత 'రాజ్యాంగు' రచనా చేతనం.. వారే మన బాబాసాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నమస్సుమాంజలులు అర్పిస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు'' అని రాసుంది.

ఇందులో ‘గుళమెత్తిన’ అని ఉన్నచోట ‘గళమెత్తిన’ అని ఉండాల్సింది. ‘రాజ్యాంగు’ అని ఉన్నచోట ‘రాజ్యాంగ’ అని ఉండాల్సింది. ‘స్వాలంబన’ కాకుండా ‘స్వావలంబన’ అని ఉండాలి.

ఈ పోస్ట్ చూసి నెటిజనులు బండి సంజయ్ ని ఓ ఆటాడుకున్నారు. అంబేడ్కర్ 'గుళమెత్త'లేదు మహానుభావా గళమెత్తారు. అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ‘ఇలా అయితే ఎలా బండి.. ఎప్పుడు నేర్చుకుంటావో ఏందో..’ అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘స్వాలంబన కాదు మహాప్రభో.. ‘స్వావలంబన’ ఎవరయ్యా తమర్ని అధ్యక్షుడు చేసింది..? ...ఇలా నెటిజనుల ట్రోలింగును చూసిన బండి వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసి కొద్ది సేపట్లో మరో పోస్టర్ షేర్ చేశారు. అయితే రెండోసారి కూడా ‘స్వాలంబన’ అనేది మారకపోవడంతో మళ్లీ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఇక మరో బీజేపీ నాయకురాలు కూడా కూడా ఈ రోజు నెటిజనుల చేతికి చిక్కారు. బీజేవైఎంకు చెందిన మహిళా నేత కసిరెడ్డి సింధు రెడ్డి అంబేడ్కర్ జయంతి సందర్భంగా,స్వామి వివేకానందకు నమస్కరిస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ అంబేడ్కర్ జయంతి అంటూ ట్వీట్ చేశారు. నెటిజనులు ట్రోల్ చేయడంతో ఆమె వెంటనే తన ట్వీట్ ను డిలీట్ చేశారు.

ఇలా బీజేపీ వాళ్ళే ఎందుకు అడ్డంగా బుక్ అవుతున్నారంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తుండగా, అతి తెలివిపరులు బీజేపీలోనే ఉంటారని బీఆరెస్, కాంగ్రెస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.




First Published:  14 April 2023 2:12 PM IST
Next Story