Telugu Global
Telangana

సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంను ఆ పార్టీ ప్రకటించింది.

సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
X

సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంను కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ఆయన పేరును ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.సత్యం పేరును ఆ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి పల్లా వెంకట్‌రెడ్డి ప్రతిపాదించినట్లు టాక్. సీనియర్‌నేత చాడ వెంకట్‌రెడ్డి పేరునూ ప్రతిపాదించగా.. తాను పోటీలో ఉండటం లేదని ఆయన ప్రకటించారు. దీంతో సత్యం పేరును సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఖరారు చేసింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెంకు చెందిన నెల్లికంటి సత్యం యాదవ సామాజిక వర్గానికి చెందినవారు.

1969 జూన్‌ 6న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతమ్మ, పెద్దయ్య, భార్య అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మునుగోడు స్థానంలో పోటీ చేయాల్సిందేనని సీపీఐ నల్గొండ జిల్లా నాయకత్వం పట్టుబట్టింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ కొత్తగూడెం స్థానాన్ని కేటాయించిందని వివరిస్తూ భవిష్యత్తులో వచ్చే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని నెల్లికంటి సత్యంకు పార్టీ నాయకులు హామీ ఇచ్చారు.అయితే…ఈ సారి నల్గొండకే నాలుగు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), కేతావత్ శంకర్ నాయక్ (కాంగ్రెస్), నెల్లికంటి సత్యం (సీపీఐ), దాసోజు శ్రవణ్ (బీఆర్ఎస్) ఈ నలుగురిది కూడా నల్గొండ కావడం గమనార్హం.

First Published:  10 March 2025 9:08 AM IST
Next Story