Telugu Global
Telangana

ప్రభుత్వంతో చర్చలు సఫలం...స‌మ్మె విర‌మించిన తెలంగాణ‌ వీఆర్ఏలు

తెలంగాణ‌లో 80 రోజులుగా స‌మ్మె చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు స‌మ్మె విరమించారు. ప్రభుత్వంతో ఈ రోజు జరిగిన చర్చలు ఫలప్రదం అవడంతో స‌మ్మె విరమిస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు.

ప్రభుత్వంతో చర్చలు సఫలం...స‌మ్మె విర‌మించిన తెలంగాణ‌ వీఆర్ఏలు
X

80 రోజులుగా స‌మ్మె చేస్తున్న తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)ల తో ఈ రోజు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి సోమేశ్ కుమార్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స‌మ్మె విరమించాలని సీఎస్ చేసిన ప్ర‌తిపాద‌న‌కు వీఆర్ఏలు అంగీక‌రించారు.

సమ్మె కాలం జీతం, సమ్మె చేస్తున్నప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం వంటి వాటిపై మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన త‌ర్వాత అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని సోమేశ్ కుమార్ .ఇచ్చిన హామీతో వీఆర్ఏలు సంతృప్తి చెందారు.

ఈ సంద‌ర్భంగా వీఆర్ఏల యూనియన్ నాయకులు వంగ ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయన్నారు. తాము రేప‌ట్నుంచి విధుల‌కు హాజ‌ర‌వుతామ‌ని పేర్కొన్నారు. ప్ర‌మోష‌న్లు, తదితర‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించడానికి సీఎస్ సానుకూలంగా స్పందించారని ర‌వీంద‌ర్ రెడ్డి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన త‌ర్వాత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారిస్తామ‌ని సీఎస్ హామీ ఇచ్చినట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

First Published:  12 Oct 2022 8:15 PM IST
Next Story