Telugu Global
Telangana

సైకో కిల్లర్ హరిహరకృష్ణ లవర్ నిహారిక అరెస్ట్..

హత్య జరిగిన రోజు రాత్రి సంఘటనా స్థలానికి నిహారికను తీసుకువెళ్లి, నవీన్ మృతదేహాన్ని హరిహర కృష్ణ చూపించాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నిహారికతో పాటు వారి మిత్రుడు హసన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లాడు.

సైకో కిల్లర్ హరిహరకృష్ణ లవర్ నిహారిక అరెస్ట్..
X

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నవీన్ అనే విద్యార్థి హత్య కేసులో పోలీసులు, ఉమ్మడి ప్రియురాలు నిహారికను అరెస్ట్ చేశారు. నవీన్ ని దారుణంగా హత్యచేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మాయం చేసిన హరిహరకృష్ణను ఇంతకు ముందే పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు విచారణలో కీలక విషయాలు బయటపడటంతో ప్రియురాలు నిహారికతో పాటు మరో స్నేహితుడు హసన్ ను కూడా అరెస్ట్ చేశారు. నిహారిక, హసన్‌ కు నవీన్ హత్య గురించి ముందే తెలుసని పోలీసులు నిర్థారించుకున్నారు. నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రకటించారు. హరిహర కృష్ణ.. నవీన్ ను హత్య చేసిన తర్వాత దారుణంగా శరీర భాగాలను కోసి.. వాటి ఫోటోలను నిహారికకు పంపాడు. ఆ తర్వాత నిహారిక హరిహరకృష్ణకు 1500 రూపాయలు ఆన్ లైన్ ద్వారా పంపినట్టు గుర్తించారు. హత్య విషయం బయటపడిన తర్వాత ప్రియురాలు నిహారిక వాట్సాప్ చాటింగ్ ను డిలీట్ చేయడమే కాకుండా.. సాక్ష్యాల ట్యాంపరింగ్‌ కు ప్రయత్నించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

హత్య జరిగిన రోజు రాత్రి సంఘటనా స్థలానికి నిహారికను తీసుకువెళ్లి, నవీన్ మృతదేహాన్ని హరిహర కృష్ణ చూపించాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నిహారికతో పాటు వారి మిత్రుడు హసన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లాడు. నవీన్ మృతదేహాన్ని చూసిన అనంతరం అక్కడ కాసేపు ఉన్న ఈ ముగ్గురు.. తిరిగి తమతమ ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలిసింది. హత్య తర్వాత హసన్ ఇంటిలోనే హరిహరకృష్ణ దుస్తులు మార్చుకున్నాడు. విచారణలో ఈ విషయాలకు సాక్ష్యాధారాలు దొరకడంతో పోలీసులు ఈ కేసులో A2గా నిహారికను, A3గా హసన్‌ ను చేర్చారు.

నవీన్, హరిహర కృష్ణ, నిహారిక ఇంటర్మీడియట్‌ లో కలిసి చదువుకున్నారు. ముందు హరిహరకృష్ణ, నిహారిక ప్రేమించుకున్నారు. అయితే.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ అయింది. ఆ తర్వాత నిహారిక నవీన్ కి దగ్గరైంది. వీరి ప్రేమ విషయం తెలిసిన హరిహర కృష్ణ.. తన ప్రియురాలు దూరమవుతుందన్న భయంతో నవీన్‌ ని హతమార్చాడు.

పట్టించిన ‘గుడ్ బాయ్’..

నవీన్ ని హత్య చేసిన అనంతరం అతడి శరీర భాగాలను కట్ చేసి, వాటి ఫొటోలను ప్రియురాలు నిహారికకు వాట్సప్ చేశాడు హరిహరకృష్ణ. ఆ ఫొటోలకు ఆమె గుడ్ బాయ్ అని రిప్లై ఇచ్చింది. అంటే నవీన్ హత్యకు హరిహరకృష్ణను నిహారిక ప్రేరేపించిందా అనే అనుమానం పోలీసులకు వచ్చింది. విచారణలో నిజాలు చెప్పడానికి నిహారిక ముందు మొండికేసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. కానీ పోలీసులు సాక్ష్యాధారాలు సంపాదించి ఆమె డ్రామాలకు చెక్ పెట్టారు. ఇప్పుడీ కేసులో మొత్తం ముగ్గురు అరెస్ట్ అయ్యారు.

First Published:  6 March 2023 7:34 PM IST
Next Story