Telugu Global
Telangana

నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 : ఇంక్యుబేటర్ కేటగిరీలో విజేత THub

ఈ అవార్డును కేంద్ర మంతృల చేతుల మీదుగా టీ-హబ్‌ సీఈవో శ్రీనివాసరావు మహంకాళి అందుకున్నారు. ఈ అవార్డు సాధించినందుకు మంత్రి కేటీఆర్ THub కు బృందాన్ని అభినందించారు.

నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 : ఇంక్యుబేటర్ కేటగిరీలో విజేత THub
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ‌కంగా చేపట్టిన THub కు నేషనల్ అవార్డ్ లభించింది. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ పేరుతో ప్రతి ఏడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో ఈ సారి ఇంక్యుబేటర్ కేటగిరీలో THub విజేతగా నిల్చింది. జాతీయ స్టార్టప్ అవార్డ్‌లను ప్రతి సంవత్సరం జనవరి 16న జాతీయ స్టార్టప్ డే రోజున భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.

ఢిల్లీలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యం,పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ సమక్షంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ & జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ అవార్డును ప్రకటించారు.

ఈ అవార్డును కేంద్ర మంతృల చేతుల మీదుగా టీ-హబ్‌ సీఈవో శ్రీనివాసరావు మహంకాళి అందుకున్నారు. ఈ అవార్డు సాధించినందుకు మంత్రి కేటీఆర్ THub కు బృందాన్ని అభినందించారు.

కాగా మన దేశంలో స్టార్టప్ లకు కేరాఫ్ అడ్రస్ గా 'టీ హబ్' మారింది. తెలంగాణ ప్రభుబుత్వం , ముఖ్యంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవ, శ్రద్ధతో టి హబ్ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం టీ హబ్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇన్నోవేషన్‌ హబ్‌గా నిలిచింది.

2015, నవంబర్‌ 5న ప్రారంభమైన టీ-హబ్‌ యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది.

తమకు ఈ అవార్డు రావడం పై హర్షం వ్యక్తం చేసిన టీ-హబ్‌ సీఈవో శ్రీనివాసరావు. ఇది కేటీఆర్ కృషి ఫలితమన్నారు.

''T-Hub, దాని వివిధ కార్యక్రమాల ద్వారా 2,000 కంటే ఎక్కువ స్టార్టప్ లకు సహాయం అందిస్తోంది. 600 మంది ప్రపంచ, జాతీయ కార్పొరేట్ భాగస్వాములను సాధించింది. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, ట్రావెల్‌టెక్, EVలు, రిటైల్, స్పేస్‌టెక్, ఫెమ్‌టెక్ తదితర రంగాలు ఈ సంవత్సరం మంచి ప్రభావం చూపిస్తాయి. '' అని శ్రీనివాసరావు చెప్పారు.

2022-23 యూనియన్ బడ్జెట్ స్టార్ట్-అప్‌ల వృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని తాము ఆశిస్తున్నామని శ్రీనివాస రావు అన్నారు. పెట్టుబడులకు పన్ను రాయితీలు, తక్కువ TDS, ESOPలు, క్లియరెన్స్‌ల కోసం సింగిల్ విండో విధానం రాబోయే బడ్జెట్‌లో ప్రకటిస్తారని తాము భావిస్తున్నట్టు ఆయన అన్నారు.


First Published:  16 Jan 2023 3:51 PM IST
Next Story